న్యూజిలాండ్‌ మంత్రికి కేటీఆర్‌ అభినందనలు | KTR Greated New Zealand first Indianorigin minister Priyanca Radhakrishnan | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ మంత్రి ప్రియాంకకు కేటీఆర్‌ అభినందనలు

Nov 2 2020 2:25 PM | Updated on Nov 2 2020 4:19 PM

   KTR Greated New Zealand first Indianorigin minister Priyanca Radhakrishnan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : న్యూజిలాండ్‌  ప్రధానమంత్రి  జెసిండా ఆర్డెర్న్‌  కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.  ప్రధాని జెసిండా మంత్రివర్గంలో చేరనున్న ప్రియాంకకు అభినందనలు అంటూ ఆయన సోమవారం ట్వీట్‌​  చేశారు. న్యూజిలాండ్‌ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అంటూ కేటీఆర్‌‌ శుభాకాంక్షలు తెలిపారు.  అలాగే తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిండాను కూడా ఆయన అభినందించారు. (జెసిండా మరో సంచలనం)

Advertisement
 
Advertisement
Advertisement