
సాక్షి, హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇది ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ధరల పెంపుగా ఆమె అభివర్ణించారు.
దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతుందని, మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిండర్, పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీని భరించాల్సిన కేంద్రం, సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. ప్రజలు దుకాణాలకు వెళ్లాలంటేనే భయపడేలా నిత్యావసరాల ధరలు పెరిగాయని కవిత అన్నారు.