
వరంగల్: మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
నీట్-పీజీ అర్హత సాధించిన అర్హత సాధించిన విద్యార్థులు OCI, NRI అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ నమోదు కేవలం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం రాష్ట్ర మెరిట్ స్థానం నిర్ణయించేందుకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మెరిట్ జాబితా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా ప్రకటిస్తారు.
సీట్ల వివరాలు 2025-26 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటా కింద అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య వెబ్‌సైట్‌లో వెబ్ ఆప్షన్లకు ముందు ప్రకటిస్తారు. https://pvttspgmed.tsche.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.

