
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ టాటా పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహిణతో ప్రతిరోజూ న్యూసెన్స్ ఎక్కువైందంటూ ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు 2, 3 వరకు పబ్ మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన, తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుందంటూ ఆందోళన నిర్వహించారు.
ఇళ్లలో వృద్ధులు, పెద్దవారు, చిన్నవారికి టాటా పబ్ తలనొప్పిగా మారింది. గతంలో టాటా పబ్‌లో రేవ్ పార్టీలు, అసభ్యకర నృత్యాలు నిర్వహిస్తుండటంతో పలు కేసులు నమోదయ్యాయి. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పబ్‌ను ఇక్కడి నుంచి వెంటనే తీసివేయాలని కాలనీ వాసులు నిరసనకు దిగారు.
చదవండి: (టాలీవుడ్ క్లబ్‌పై దాడులు.. అర్ధనగ్న నృత్యాలు, వికృత చేష్టలు)