రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్మికుంట వాసి నామినేషన్‌ | Jammikunta Srikanth Filed Nomination For Presidential Election 2022 | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్మికుంట వాసి నామినేషన్‌

Jun 19 2022 3:05 AM | Updated on Jun 19 2022 4:00 PM

Jammikunta Srikanth Filed Nomination For Presidential Election 2022 - Sakshi

హుజూరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్‌ శనివారం ఢిల్లీలో నామినేషన్‌ దాఖలు చేశారు. శ్రీకాంత్‌ 2018లో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2019లో కరీంనగర్‌ ఎంపీగా, 2019లో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీలో నిలిచారు. 2020లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.

2021లో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో.. హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీలో నిలిచారు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement