Photo Feature: నేలతల్లి సాక్షిగా.. కన్నవారికి నివాళి అర్పించి‘నారు’  | Jakranpally Ideal Farmer Raised Large Quantity Of paddy Grown In His Field | Sakshi
Sakshi News home page

Photo Feature: నేలతల్లి సాక్షిగా.. కన్నవారికి నివాళి అర్పించి‘నారు’ 

Aug 19 2022 7:14 PM | Updated on Aug 19 2022 7:29 PM

Jakranpally Ideal Farmer Raised Large Quantity Of paddy Grown In His Field - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: సేంద్రియ విధానంలో అనేక దేశీయ వరి రకాలను పండిస్తున్న నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూ­రుకు చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు (నాగుల చిన్నగంగారాం) తన తల్లిదండ్రులు ముత్తెన్న, భూదే­విలను నేలతల్లి సాక్షిగా వినూత్నంగా స్మరించుకున్నారు. ‘మా అమ్మ నాన్న–­చిన్నికృష్ణుడు’ అనే అక్షరాల రూపంలో పొలంలో భారీ పరి­మాణంలో వరి పంట పెరిగేలా వేశా­రు. 24 రోజుల క్రితం తన సాగు భూమిలో ‘చింతలూరు సన్నాలు’ వరిని విత్తనాల కోసం నాటారు.

అయితే మధ్యలో ఒక మడిని ‘బంగారు గులాబీ’ అనే నల్ల రంగు వరిని తన తల్లిదండ్రుల రూపం వచ్చేలా నాటారు. చుట్టూ బోర్డర్‌ వచ్చేలా ‘పంచరత్న’ రకం వరిని వేశారు. ఇందు­కోసం ముందుగా ఓ ఆర్కిటెక్ట్‌తో కాగి­తంపై మ్యాప్‌ గీయించుకుని అందుకు అనుగుణంగా వరి రకాలను నాటారు. తాజాగా గురువారం డ్రోన్‌ ద్వారా చిన్నికృష్ణుడు ఈ చిత్రాన్ని ఫొటో తీయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement