గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా వాసికి ఊరట

Jagtial Man Stranded in Gulf Without Passport Get Relief - Sakshi

పాస్‌పోర్టు లేక గల్ఫ్‌లో చిక్కుకున్న కొండగట్టు

గల్ఫ్‌ సంక్షేమ సంఘాల ప్రతినిధుల చొరవతో స్వదేశానికి.. 

కథలాపూర్‌ (వేములవాడ): చేయని తప్పునకు జైలు పాలై.. పాస్‌పోర్టు లేక దుబాయ్‌లో చిక్కుకున్న జగిత్యాల జిల్లావాసికి ఊరట లభించింది. గల్ఫ్‌ సంక్షేమ సంఘాల చొరవతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన పిట్టల కొండగట్టు రెండేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. గతేడాది మార్చిలో కొండగట్టు పేరిట రిజిస్టర్‌ అయిన సిమ్‌కార్డు పాకిస్తాన్‌ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఉపయోగించాడు. 

అతను చేసిన తప్పులకు కొండగట్టును అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 8 నెలలు జైలు జీవితం గడిపిన కొండగట్టు.. ఇటీవల విడుదలయ్యాడు. అయితే.. కొండగట్టు వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో స్వదేశానికి రాలేకపోయాడు. ఈ విషయమై గత నెల 21న ‘స్వదేశానికి రప్పించండి’శీర్షికన సాక్షి మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌ సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్పందించారు. కొండగట్టు స్వదేశానికి వచ్చేందుకు కోర్టు అనుమతి పత్రం, ఎన్‌ఓసీ దుబాయ్‌లోని రాయబార కార్యాలయానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అతను స్వగ్రామానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. 

ఇక్కడ చదవండి:
శ్రీనివాస్‌ను జైలు నుంచి విడిపించరూ..! 

ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top