కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో ఐటీ దాడులు.. ఆరుగంటలుగా కొనసాగుతున్న సోదాలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో ఐటీ దాడులు.. ఆరుగంటలుగా కొనసాగుతున్న సోదాలు

Published Thu, Nov 2 2023 8:20 AM

It Searches In Maheshwaram Congress Candidate Klr House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్‌, బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

కేఎల్‌ఆర్‌ నివాసం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తుక్కుగూడలో పార్టీ కార్యాలయాన్ని కేఎల్‌ఆర్‌ ప్రారంభించారు. 

అటు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉన్న అక్బర్ బాగ్‌లో  కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల్లో పలు ఫామ్ హౌస్‌లు, గచ్చిబౌలి సమీపంలో ఎన్సిసీలో కూడా విల్లా ఉన్నట్టు సమాచారం.

మరో వైపు, కాంగ్రెస్‌ నేత పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బడంగ్‌ పేట్‌ కార్పొరేటర్‌గా ఉన్న పారిజాత.. మహేశ్వరం కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించారు. తెల్లవారు జామున 5 గంటలకు చేరుకున్న ఐటీ అధికారులు.. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

కోకాపేట్‌ హిడెన్‌ గార్డెన్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. గిరిధర్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. 

చదవండి: కాంగ్రెస్‌ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement