చైనా బెట్టింగ్‌ కంపెనీ: దర్యాప్తు ప్రారంభించిన అధికారులు | Investigation Started in China Betting Company Case | Sakshi
Sakshi News home page

చైనా బెట్టింగ్‌ కంపెనీ: దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

Aug 19 2020 3:10 PM | Updated on Aug 19 2020 3:10 PM

Investigation Started in China Betting Company Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్ బెట్టింగ్ స్కాంపై  విచారించేందుకు  కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్‌ కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగాయి. ఈ రెండు సంస్థల అధికారులు  హైదరాబాద్ సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న చైనా కంపెనీ  ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. రూ.1106  కోట్లు చైనాలోని బీజింగ్ టుమారో కంపెనీకి బదలీ  చేయడంపై అధికారులు దృష్టి సారించారు.  రెండు అకౌంట్లు ద్వారా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌కు నగదు బదిలి చేసినట్లు అధికారులు నిర్ధారించారు. డాకిపే, లింక్ యు అనే కంపెనీ అకౌంట్ల ద్వారా రూ.1106 కోట్లు బదిలి అయినట్లు గుర్తించారు. పేటీయం ద్వారా చైనా కంపెనీ డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో  పేటీఎం ప్రతినిధులకు సీసీఎస్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ  సందర్భంగా  పేటీఎం ప్రతినిధులు సీసీఎస్‌ ఎదుట హాజరయ్యారు.  ఆరు నెలల్లో రూ.646 కోట్లను హెచ్ఎస్‌బీసీ బ్యాంక్‌కు బదిలీ చేసినట్లు పేటీఎం అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో వచ్చిన డబ్బులను  చైనా కంపెనీ  పేటీఎంలో  డిపాజిట్ చేయించినట్లు తెలుస్తోంది. 2019 లో కేవలం ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసిన బీజింగ్ టుమారో కంపెనీ ఈ ఏడాది ఆరు మాసాల్లోనే రూ. 1102 కోట్ల రూపాయలు వ్యాపారం చేసింది.  లాక్‌డౌన్‌ సమయంలోనే ప్రజల సొమ్మును ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా ఈ  కంపెనీ కొట్టేసింది. 

చదవండి: కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు

Advertisement
 
Advertisement
Advertisement