
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సమాచార కియోస్క్‌లు
విమానాల రాక, పోకలపై ఎప్పటికప్పుడు వివరాలు
ప్రయాణికుల గైడ్ కోసం రూట్‌మ్యాపులు
జాప్యానికి తావు లేకుండా సత్వర సేవలు
సాక్షి, సిటీబ్యూరో: విమానాల రాకపోకలపై రియల్ టైం సమాచారాన్ని అందజేసే అధునాతన కియోస్‌్కలను హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఫ్లైట్ వాస్తవ సమాచారం లభిస్తుంది. రియల్ టైం సమాచారం వల్ల ప్రయాణికులకు తమ జర్నీ సమయంపై స్పష్టమైన అవగాహన లభిస్తుంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే సుమారు 400కు పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల వివరాలను కియోస్క్‌ల ద్వారా తెలుసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన, సత్వర సదుపాయాలను అందజేసే చర్యల్లో భాగంగా టెర్మినళ్లపై వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతంఅంతర్జాతీయ విమానాశ్రయాల్లో వివిధ రకాల కియోస్క్‌లు ఉన్నాయి. చెక్–ఇన్ వంటి సదుపాయాల కోసం కొన్నింటిని వినియోగిస్తున్నారు. బ్యాగేజ్ సేవల కోసం, అదనపు లగేజీ చెల్లింపులు వంటి వాటి కోసం కూడా ఎయిర్‌లైన్స్ కొన్ని రకాల కియోస్క్‌లను వినియోగిస్తున్నాయి, కొన్ని కియోస్‌్కల ద్వారా నచ్చిన సీట్లను కూడా ఎంపిక చేసుకొనే సదుపాయం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ తాజాగా ఈ సమాచార కియోస్క్‌లను ప్రవేశపెట్టింది.
సత్వర స్పందన..
⇒ సాధారణంగా ఆలస్యంగా చేరుకొనే విమానాలు, ఆలస్యంగా బయలుదేరే వాటి వివరాలపై అధికారిక ప్రకటన వస్తే తప్ప సమాచారం లభించదు. ఇప్పుడు ప్రయాణికులే స్వయంగా ఈ వివరాలను తెలుసుకొనే అవకాశం ఉంది. అలాగే ఎయిర్‌పోర్టు నుంచి టెరి్మనల్‌కు వెళ్లేవాళ్లు, టెరి్మనల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చేవాళ్లు ప్రవేశ, ని్రష్కమణ మార్గాలను కూడా ఈ కియోస్‌్కల ద్వారా తెలుసుకొనే సదుపాయం ఉంది. నావిగేషన్ మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎయిర్‌పోర్టులో లభించే వివిధ రకాల సదుపాయాల రూట్‌మ్యాపులు కూడా ఈ కియోస్‌్కలలో ఉన్నాయి.
⇒ ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి, జాప్యానికి తావు లేకుండా ఎయిర్‌పోర్టు సేవలను వినియోగించుకోవచ్చని రెండు రోజుల క్రితం ఆ్రస్టేలియా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అవినాష్ అనే ప్రయాణికుడు తెలిపారు.కియోస్క్ సేవల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కియోస్‌్కల ద్వారా వైఫై సేవలను కూడా అందజేస్తున్నారు. ప్రయాణికులు తమ ఫ్లైట్ పీఎన్నార్ నంబర్‌ను నమోదు చేసి వైఫై సేవలను పొందవచ్చు. ఎయిర్‌పోర్ట్ సేవల పట్ల స్పందన తెలియజేసేందుకు కూడా ఈ కియోస్‌్కలలో ఒక ఆప్షన్ ఏర్పాటు చేశారు. రూట్ మ్యాపుల ద్వారా ఎయిర్‌పోర్టులో ఏ సదుపాయం ఎక్కడ లభిస్తుందో తెలుసుకొని నేరుగా అక్కడికి చేరుకోవచ్చు.
ఉత్తమ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు..
ప్రయాణికుడే ప్రథమం అనే లక్ష్యంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేక రకాల సేవలను అందజేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ప్రయాణికుల సంఖ్య, విమానసీట్ల భర్తీ ఆధారంగా 4వ స్థానంలో నిలిచింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఎయిర్‌పోర్టుగా గుర్తింపును పొందింది. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 400కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 80 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 70కిపైగా నగరాలకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఉంది. 20కి పైగా అంతర్జాతీయ నగరాలకు నేరుగా హైదరాబాద్ నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.