
సాక్షి, హైదరాబాద్: నగరంలో కోవిడ్ టీకాల కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. లబ్ధిదారుల నిష్పత్తికి తగినంత వ్యాక్సిన్ సరఫరా కాకపోవడంతో రోజు సగటు టీకాలు సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం భారీగా తగ్గింది. నిజానికి కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో (ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రోజుకు సగటున 80 వేల నుంచి లక్ష మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య 15 వేలకు మించడం లేదు. ఇప్పటికే ఫస్ట్ డోస్ పూర్తి చేసుకుని రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఆన్‌లైన్‌లో స్లాట్ దొరక్కపోవడంతో చాలా మంది నేరుగా టీకా కేంద్రాలకు చేరుకుంటున్నారు. అప్పటికే అక్కడ భారీగా జనం బారులు తీరడం, లబి్ధదారుల నిష్పత్తికి తగినంత వ్యాక్సిన్ సరఫరా చేయక పోవడంతో నిరాశతో వెనుతిరుగాల్సివస్తోంది. జనవరి 16 నుంచి జూలై 10 వరకు మూడు జిల్లాల పరిధిలో మొత్తం 59,84,871 మంది టీకాలు తీసుకోగా, వీరిలో ఇప్పటి వరకు 9,68057 మంది మాత్రమే రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. మరో 50,16,814 మంది రెండో డోస్ టీకా కోసం ఎదురు చూస్తున్నారు.
42.73 లక్షల మందికి కోవిషీల్డే..
ఇప్పటి వరకు టీకాలు తీసుకున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే అధికంగా ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో 32,54,568 మంది పురుషులు టీకా వేసుకోగా, 27,29,309 మంది మహిళలు, 994 మంది ఇతరులు ఉన్నారు. 42,73,147 మంది కోవిïÙల్డ్ టీకా తీసుకోగా, 16,57,594 మంది కోవాగ్జిన్ తీసుకున్నారు. మరో 54130 మంది స్ఫుతి్నక్ టీకా తీసుకోవడం గమనార్హం.
∙ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో సిటీజన్ల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా.. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టింది. రెండు నెలల క్రితం వంద నమూనాలను పరీక్షిస్తే.. వీటిలో 18 నుంచి 22 శాతం పాజటివ్ నమోదయ్యేది. ప్రస్తుతం వంద శాంపిల్స్ పరీక్షిస్తే..ఒకటి రెండుకు మించి ఎక్కువ కేసులు నిర్ధారణ కావడం లేదు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి స్పష్టం చేశారు.
వ్యాక్సినేషన్ ఇలా..
జిల్లా | ఫస్ట్ డోస్ | సెకండ్ డోస్ | మొత్తం |
హైదరాబాద్ | 23,16,336 | 4,59,369 | 27,75,705 |
మేడ్చల్ | 13,14,470 | 2,49,931 | 15,64,401 |
రంగారెడ్డి | 13,86,008 | 2,58,757 | 16,44,765 |