మళ్లీ.. మళ్లీ.. కడిగేస్తున్నారు!

Hyderabad People Using Water More Than Two Times - Sakshi

కోవిడ్‌ ఎఫెక్ట్‌తో గ్రేటర్‌లోపెరిగిన నీటి వినియోగం

రోజుకు రెండుమార్లు స్నానం.. తరచూ చేతులు, కాళ్లు శుభ్రం 

నిత్యం 204 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్న జలమండలి

సాక్షి, సిటీబ్యూరో: ‘ఎల్భీనగర్‌లో నివసించే విక్రమ్‌ ఇటీవలి కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగొచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం అలవాటు చేసుకున్నాడు. కోవిడ్‌ భయంతో రోజుకు 2–3 సార్లు స్నానం చేయడం..4–5 సార్లు చేతులు, కాళ్లు కడుక్కుంటున్నారు. దీంతో ఐదుగురు నివాసం ఉండే వారింట్లో నీటివినియోగం అనూహ్యంగా పెరిగింది’.  ఈ పరిస్థితి విక్రమ్‌ ఒక్కరిదే కాదు..గ్రేటర్‌సిటీజన్ల అందరిదీ. కోవిడ్‌ పంజా విసరడంతో నగరంలో పాజిటివ్‌కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకుఅధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పలుమార్లు స్నానంచేయడం, చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం చేస్తున్నారు. దీంతో ఇళ్లలో నీటివినియోగంఅనూహ్యంగా పెరిగింది.

మహానగరం పరిధిలోని సుమారు 10.60 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 204 కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. ప్రధాన నగరంలో ప్రతీ ఒక్కరికీ నిత్యం 130 లీటర్లు, శివారు ప్రాంతాల్లో ఒక్కొక్కరికీ 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తోంది. ఇక జలమండలి తాగునీటి సరఫరా నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో స్థానికులు బోరుబావుల నీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బోరుబావుల నుంచి నిత్యం సుమారు 300 కోట్ల లీటర్ల నీటిని సిటీజనులు తోడేస్తున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో భూగర్భజలమట్టాలు పెరగడంతో బోరుబావుల్లో సమృద్ధిగా నీటినిల్వలుండడంతో వ్యక్తిగత అవసరాలకు నీటిఇక్కట్లు లేకపోవడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక్కో వ్యక్తికి నిత్యం తాగడానికి, స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం ఇతర వ్యక్తిగత అవసరాలకు సుమారు 130 లీటర్ల నీరు అవసరం. నగరంలో ఆమేర నీటి లభ్యత ఉంది. 

వర్షాకాలంలోనూ.... 
సాధారణంగా వర్షాకాలం సీజన్‌లో నీటివినియోగం తగ్గడం పరిపాటే. కానీ ఈసారి మార్చి నెల నుంచి ప్రస్తుత తరుణం వరకు నీటి వినియోగం క్రమంగా పెరుగుతుందే కానీ..తగ్గడంలేదు. ప్రస్తుతం జలమండలి కృష్ణామూడుదశలు,గోదావరి మొదటి దశతోపాటు జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నిత్యం 204 కోట్ల లీటర్లు(2047 మిలియన్‌ లీటర్లు) నీటిని సేకరించి శుద్ధిచేసి 10.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫరా చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటి తరలింపు,శుద్ధి చేసేందుకు ప్రతీ వెయ్యి లీటర్లకు జలమండలి రూ.45–50 ఖర్చు చేస్తుండగా..వినియోగదారుల నుంచి రూ.10 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని సుమారు 23 లక్షల బోరుబావుల నుంచి నిత్యం సుమారు 300 కోట్ల లీటర్ల నీటిని తోడేస్తూ వివిధ గృహ, వాణిజ్య అవసరాలకు సిటీజన్లు వినియోగిస్తుండడం విశేషం. 

ఈ ఏడాది నీటికొరత లేనట్టే.. 
గ్రేటర్‌ నగరానికి తాగునీరందిస్తోన్న నాగార్జునసాగర్‌ (కృష్ణా), ఎల్లంపల్లి (గోదావరి), జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల్లో ఇటీవలి వర్షాలకు నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. రాగల 2 నెలల్లో ఈ జలాశయాలు నిండుకుండల్లా మారతాయని ఆశిస్తున్నాం. ఆయా జలాశయాల్లో నీటినిల్వలు సమృద్ధిగా ఉంటే నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగరవాసులు ప్రతి ఒక్కరికీ నిత్యం 130 లీటర్ల స్వచ్ఛమైనతాగునీరందించడమే జలమండలి లక్ష్యం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

27-09-2020
Sep 27, 2020, 18:57 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 76,416 నమూనాలు...
27-09-2020
Sep 27, 2020, 11:09 IST
కోల్‌కతా: లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సినిమా హాళ్లు, ఓపెన్‌-ఎయిర్‌ థియేటర్లు తిరిగి తెరచుకునేందుకు అనుమతిస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కరోనా...
27-09-2020
Sep 27, 2020, 10:46 IST
భువనేశ్వర్‌ : రాష్ట్రంలో కరోనా ఇంజెక్షన్ల తయారీ కలకలం రేపింది.   బర్‌గడ్‌ జిల్లా భెడేన్‌ సమితిలోని రుసుడా గ్రామంలో...
27-09-2020
Sep 27, 2020, 09:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ఒక్కరోజే కొత్తగా 88,600 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
27-09-2020
Sep 27, 2020, 03:32 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం క్రమేణా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 89.31 శాతం రికవరీ రేటుగా...
27-09-2020
Sep 27, 2020, 03:05 IST
జెనీవా: కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచ దేశాలు కలసికట్టుగా యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రపంచ...
26-09-2020
Sep 26, 2020, 18:39 IST
రాష్ట్రవ్యాప్తంగా 75,990 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 7293 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
26-09-2020
Sep 26, 2020, 17:57 IST
ముంబై: మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవాళి మనుగడకు సవాలు విసురుతున్న...
26-09-2020
Sep 26, 2020, 15:00 IST
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు....
26-09-2020
Sep 26, 2020, 12:23 IST
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి తీవ్రత పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధికారులు మరోసారి ప్రపంచ దేశాలను...
26-09-2020
Sep 26, 2020, 11:29 IST
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కోవిడ్‌-19 కట్టడికి గ్లోబల్‌ ఫార్మా దిగ్గజాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా...
26-09-2020
Sep 26, 2020, 09:44 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై  లాన్సెట్ సంచలన హెచ్చరికలు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వసానుకూల ధోరణిపై ఆందోళన...
26-09-2020
Sep 26, 2020, 09:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362...
26-09-2020
Sep 26, 2020, 04:56 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు 54.47 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 69,429...
26-09-2020
Sep 26, 2020, 01:57 IST
లండన్‌: కరోనా మహమ్మారి ప్రభావం  బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2పైనా పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల సందర్శకుల రాక...
25-09-2020
Sep 25, 2020, 20:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,827 పాజిటివ్‌...
25-09-2020
Sep 25, 2020, 18:59 IST
చైనాలోని వుహాన్‌ నగరంలో ఓ ల్యాబ్‌ నుంచి పుట్టుకొచ్చినట్టు భావిస్తున్న కోవిడ్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలపై మీకో క్విజ్‌! ...
25-09-2020
Sep 25, 2020, 18:30 IST
గడిచిన 24 గంటల్లో 69,429 నమూనాలు పరీక్షించగా.. 7073 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
25-09-2020
Sep 25, 2020, 15:02 IST
బాలుని పాటల జాబిల్లిగా అభిమానులు కీర్తిస్తారని గుర్తు చేశారు. పాటల ప్రపంచానికి బాలు సేవలకుగాను పద్మ భూషణ్‌, జాతీయ అవార్డులు, మరెన్నో...
25-09-2020
Sep 25, 2020, 14:02 IST
'సింహపురి'లో జన్మించిన గాయకులు..ప్రపంచం గర్వించదగ్గ గాన గంధర్వులు’
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top