మధుర జ్ఞాపకాలతో కాదు.. చేదు జ్ఞాపకాలతో వీరి బాల్యం

Hyderabad: Migrant Workers Children Childhood Lives On Footpath - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ (గోల్కొండ) : ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యం ఫుట్‌పాత్‌లపైనే గడిచిపోతున్నది. మధుర జ్ఞాపికాలను మిగిల్చే బాల్యం వీరికి చేదు జ్ఞాపకాలను మిగులుస్తోందనం నిర్వివాదాశం. కరోనా నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలలో పని లేక పస్తులుంటున్న కార్మికులు పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చారు. ఇక్కడా వారికి ఉపాధి దొరకడం గగనమైపోయింది.

నగరానికి వలస వచ్చిన వీరు ఫుట్‌పాత్‌లు, ఫ్లై ఓవర్ల కింద డివైడర్ల పైనే కాపురం ఉంటున్నారు. ప్లాస్టిక్‌ ఆట బొమ్మలు, బెలూన్లు అమ్ముకుంటూ వీరు అతి కష్టంగా బతుకీడుస్తున్నారు. రాత్రంతా ఫుట్‌పాత్‌లపై ఉంటూ బెలూన్లు, ఇతర ప్లాస్టిక్‌ ఆట వస్తువులు తయారు చేసుకుంటారు. ఉదయమే ఫుట్‌పాత్‌లపై రొట్టెలు వేసుకుని వారు తిని, పిల్లలకు తినిపిస్తారు. అనంతరం కుటుంబ పెద్దలంతా ఆట బొమ్మలను అమ్మడానికి వెళ్లిపోతారు. ఒక వ్యక్తిని పిల్లలను చూడటానికి వదిలి వెళ్తారు.

పిల్లలు ఫుట్‌పాత్‌ల మీదనే స్నానం చేస్తూ, దానినే ఆడుకుంటూ ఉంటారు. రాత్రి మళ్లీ తమ తల్లిదండ్రుల ముఖాలు చూస్తారు. టోలిచౌకి చౌరాస్తా, షేక్‌పేట్‌ నాలా, రేతిబౌలి రింగ్‌ రోడ్డు, మెహిదీపట్నం పీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే తదితర ప్రాంతాలలు వలస కుటుంబాలు ఫుట్‌పాత్‌లపై, ఫ్లై ఓవర్ల కింద డివైడర్‌లపై నివసిస్తాయి.   

( చదవండి: ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాలిక కేకలు వేయడంతో! )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top