Hyderabad: 1, 2 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad: Interruption to Drinking Water Supply Full Details - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: సింగూరు ఫేజ్‌– 3 పైప్‌లైన్‌ లీకేజీలకు మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి ప్రకటించింది. బుధవారం (జూన్‌ 1) ఉదయం 6 గంటల నుంచి గురువారం (జూన్‌2) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి.  

సింగాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు 1200 ఎంఎం డయా పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్‌కు నీటి లీకేజీలు నివారించేందుకు శంకర్‌పల్లి సమీపంలో మూడు చోట్ల మరమ్మతు పనులను చేపట్టనున్నారు. దీంతో గండిపేట, నార్సింగి, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ, చందానగర్, హుడా కాలనీ, బీహెచ్‌ఈఎల్‌ ఎల్‌ఐజీ, తారానగర్, గంగారం, లింగంపల్లి రాజీవ్‌ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, గోపన్‌పల్లి, గుల్‌మొహర్‌ పార్కు, నేతాజీనగర్, నెహ్రూ నగర్, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, చింతలబస్తీ, విజయనగర్‌ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. (క్లిక్‌: సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top