లంచం ఇవ్వలేను... కనికరించండి! 

Hyderabad: Farmer From Warangal Walks For Justice - Sakshi

నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీ కార్యాలయానికి అన్నదాత

దుగ్గొండి/ఖైరతాబాద్‌: తనకు రావాల్సిన ఆస్తి విషయమై న్యాయం చేయాల ని కోరుతూ ఓ రైతు వినూత్నంగా నిరసన బాటపట్టాడు. లంచాలు ఇవ్వక పోవడంతో తనకెవరూ న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొర వినిపించేందుకు నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌కి చెందిన గట్ల సురేందర్‌ అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయి.

ఊరి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయితే పెద్ద మనుషులు లంచాలు తీసుకుని ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాసి ఉన్న ఫ్లెక్సీని నాగలికి కట్టాడు. ఆ నాగలిని ఎత్తుకుని హైదరాబాద్‌ ఇందిరాపార్కు నుంచి డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ బయలుదేరాడు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జిల్లా కార్యాలయాల్లో మూడేళ్లుగా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్‌ వచ్చానని సురేందర్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top