హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో ఉన్నపళంగా కుంగిన రోడ్డు.. పది అడుగుల మేర గొయ్యి

Hyderabad City News: Ten feet road Collapsed Himayatnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఉన్నపళంగా రోడ్డు కుంగిపోయిన ఉదంతం చోటు చేసుకుంది. శనివారం హిమాయత్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది.

హిమాయత్‌ నగర్‌లోని స్ట్రీట్‌ నెంబర్‌ 5లో పది అడుగుల మేర రోడ్డు కుంగిపోయింది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో ట్రక్కు అందులోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలుకాగా, ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top