36 కిమీ..28 నిమిషాలు!  | HYD: Traffic Police Provide Green Channel For Transport Live Orga | Sakshi
Sakshi News home page

36 కిమీ..28 నిమిషాలు! 

Nov 7 2020 8:21 AM | Updated on Nov 7 2020 8:21 AM

HYD: Traffic Police Provide Green Channel For Transport Live Orga - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు సైబరాబాద్‌ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్‌లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి లైవ్‌ ఆర్గాన్స్‌ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్‌ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్‌ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్‌ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్‌ ఆర్గాన్స్‌ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్‌లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు

అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌లకు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్‌ వాహనాలకు ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్‌ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్‌ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్‌ఛానల్‌ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement