మిరప ‘తేజ’స్సు 

History made Teja variety of stored chillies - Sakshi

చరిత్ర సృష్టించిన ‘తేజా’రకం నిల్వ మిర్చి  

క్వింటా రూ.25,800 

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజా రకం మిర్చి ధర చరిత్ర సృష్టించింది. కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి క్వింటాకు శనివారం రూ.25,800 ధర పలికింది. చరిత్రలోనే తేజా రకం మిర్చికి ఇంతటి ధర ఎప్పుడూ లభించలేదు. విదేశాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్‌ ఉండటంతో ధర పెరుగుతోందని విశ్లేíÙస్తున్నారు.

భద్రా ద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన అనంత లక్ష్మి పేరిట కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసిన 25 బస్తాల మిర్చిని ఎస్‌వీఎస్‌ చిల్లీస్‌ ట్రేడర్స్‌ బాధ్యులు అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. తేజా రకం మిర్చి ఈ ఏడాది మార్చి 20న రూ.25,550 ధర పలికింది. అదే రికార్డుగా భావిస్తుండగా.. ఇప్పుడు రూ.25,800 ధరతో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది పంట సాగు కూడా బాగా తగ్గడం, చీడపీడలతో దిగుబడి తగ్గడానికి తోడు దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో ధరకు రెక్కలొచ్చాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top