మనసు గెలిచే న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ | Sakshi
Sakshi News home page

మనసు గెలిచే న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

Published Sat, Dec 31 2022 7:09 PM

Hire IT And Staffing Multinational Company Gifts To Poor People - Sakshi

కొత్త సంవత్సరం అందరికీ ఉంటుందనుకుంటాం.. కానీ కొందరికి దాని గురించే తెలియకపోవచ్చు. ఆ పూటకు కడుపు నిండుతుందో లేదో తెలియని పేదలకు కొత్త సంవత్సరం గురించి పెద్దగా ఆలోచించే అవకాశం ఉండదు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కొత్త సంవత్సరం వేళ వారి మనస్సుల్లో ఆనందం నింపే ప్రయత్నం చేసింది ఓ కార్పోరేట్‌ కంపెనీ. హైర్‌ ఐటీ, స్టాఫింగ్లీ అనే మల్టీ నేషనల్‌ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్పోరేట్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఐదు వందల మంది పేదవారికి న్యూ ఇయర్‌ గిఫ్ట్‌లు ఇచ్చింది.

హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో రాజు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరైనా దయ చూపితేనే ఆకలి తీరుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రాజు దగ్గరికి వెళ్లారు హైర్ ఐటీ పీపుల్ మరియు స్టాఫింగ్లీ ఉద్యోగులు. అతనికి రుచికరమైన తినుబండారాలను ఇచ్చి న్యూ ఇయర్ విషెస్‌ చెప్పారు.

అలాంటి వారే మరికొందరు. గాంధీ హాస్పటల్ సమీపంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన రాముని దివ్యాంగురాలైనా ఆమె తల్లి వీల్‌ఛైర్‌లో కూర్చొబెట్టుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో  భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారు మరికొందరు. ఇలాంటి వారితో పాటు హైదరబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్లు, జ్యూస్, మంచినీటితో కూడిన రుచికరమైన తినుబండారాలను అందజేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement