హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. | Heavy Rains Across Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

Sep 3 2023 7:29 AM | Updated on Sep 3 2023 6:11 PM

Heavy Rains Across Hyderabad  - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది. రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

ఎస్సార్ నగర్, అమీర్ పేట, బోరబండ, మదాపూర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.  ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. ఎక్కడా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కాలేదు. అటు.. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేయడానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

తెల్లవారుజాము నుంచీ కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ఇదీ చదవండి: ఉచిత విద్యుత్‌ వైఎస్సార్‌ మానస పుత్రిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement