
అత్యంత చురుగ్గా రుతుపవనాలు
27న బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా ‘అరేబియా’ అల్పపీడనం!
మోస్తరు వర్షాలకు చాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల కదలిక అత్యంత చురుకుగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో చురుకుగా సాగుతున్న రుతుపవనాలు రానున్న రెండ్రోజుల్లో కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఈ నెల 27న పశి్చమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో ఏర్ప డే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉంటుంది.
గురువా రం తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్–గోవా తీర ప్రాంతం సమీపంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మరింత బలపడి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు స్పష్టమైన అల్పపీడనంగా మారిందని, ఇది క్ర మంగా బలపడి శనివారం ఉదయానికల్లా వాయుగుండంగా మారే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
శుక్రవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఖమ్మంలో అత్యధికంగా 36.0 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా మెదక్‌లో 20.0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.