భూదాన్ పోచంపల్లిలోని టూరిజం పార్కులో చేనేత మగ్గాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
ఇక్కత్ ఒక అద్భుతమైన కళ
భూదాన్ పోచంపల్లిని సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సాక్షి, యాదాద్రి, భూదాన్ పోచంపల్లి: చేనేత అంటే వస్త్రం కాదని, అది దేశ వారసత్వ సంపద అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిని తన సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో ఇక్కత్ వ్రస్తాల తయారీ విధానాలను స్వయంగా పరిశీలించి ఇక్కత్ డిజైన్లు, చేనేత కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను గతంలో త్రిపుర హ్యాండ్లూమ్ ఆఫీస్‌లో పనిచేస్తున్న కాలంలోనే పోచంపల్లి ఇక్కత్ పేరు బాగా వినబడేదని, దాంతో ఎలాగైనా పోచంపల్లిని సందర్శించి ఇక్కత్ కళను తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చి చేనేతలో నూతన డిజైన్ల అభివృద్ధి, ఉపాధి తదితర అంశాలపై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.

అందుబాటులోకి వచి్చన ఆధునిక టెక్నాలజీతో నకిలీ ఇక్కత్ వ్రస్తాల నిరోధానికి కృషి చేస్తామని అన్నారు. పోచంపల్లికి మిస్‌వరల్డ్ బృందం సందర్శనతో ఇక్కడ 30 శాతం వ్రస్తాల కొనుగోళ్లు పెరిగాయని చెప్పడం గొప్పవిషయమని అన్నారు. ఈ ప్రాంతంలోని చేనేత కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందడం అభినందనీయమన్నారు. అనంతరం చేనేత కార్మికులకు బీమా చెక్కులతో పాటు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు.
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, పలువురు చేనేత కళాకారులు పాల్గొన్నారు.