మైజీహెచ్‌ఎంసీ యాప్‌ రూపొందించిన జీహెచ్‌ఎంసీ

GHMC Elections 2020: GHMC Invite New App For Voters - Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ ఓటర్‌లకు శుభవార్త. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ ఓటరు స్లీప్‌తో పాటు పోలీంగ్‌ బూత్‌ను అరచేతిలోనే తెలుసుకునేందుకు జీహెచ్‌ఎం‍సీ కొత్త యాప్‌ను రూపొందించింది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఒటరు స్లీప్‌తో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో గూగుల్ మ్యాప్‌తో తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఓటర్ల కోసం మైజీహెచ్ఎంసీ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లీప్‌ల పంపిణిని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్‌లు ఉండడంతో అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది. అయితే అది తెలుసుకోవాలంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో మైజీహెచ్ఎంసీ యాప్‌ను లౌన్‌లోడ్‌ చేసుకోవాలి. (చదవండి: ఓటరు కార్డు లేదా.. అయితే ఇవి తెచ్చుకోండి)

యాప్‌లోకి వెళ్లి నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్‌పై క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. ఈ నో-యువర్ పోలింగ్ స్టేషన్ యాప్‌పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్‌లపైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎఫ్‌ఎం రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్లలో స్క్రోలింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే, ఈ యాప్‌పై  స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. (చదవండి: కేసీఆర్‌ ‘గ్రేటర్‌’ సభ : ఎల్బీ స్టేడియం గులాబీమయం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top