4 గంటలు శ్రమించి.. బ్లాక్‌ ఫంగస్‌ తొలగించి..

Gandhi Hospital Doctor Four Hours Operation Remove Black Fungus From Patient - Sakshi

శస్త్రచికిత్స ద్వారా ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన గాంధీ ఆస్పత్రి వైద్యులు 

గాంధీ ఆస్పత్రి: బ్లాక్‌ ఫంగస్‌ సోకి మృత్యువుతో పోరాడుతున్న బాధితుడి ప్రాణాలు నిలి పారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. అందరూ అతడిపై ఆశలు వదిలేసుకున్నా.. డాక్టర్లు మాత్రం ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఐదు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సుదీర్ఘ శస్త్రచికిత్స జరిపి విజయం సాధించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీ కమిటీ చైర్మన్‌ శోభన్‌బాబు ఆదేశాల మేరకు ఆర్‌ఎంవో–1 నరేందర్‌ వివరాలు వెల్లడించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి (45) కరోనాతో పాటు బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతూ ఈనెల 19న ‘గాంధీ’లో చేరాడు. ఎడమ దవడ వాయ డంతో పాటు ఎడమ కన్ను పూర్తిగా కనిపించట్లేదు. కుడికన్ను కొంచెం కనిపిస్తోంది. ముఖం లోని పలు భాగాలకు ఫంగస్‌ వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు. ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, పాస్లిక్‌ సర్జరీ, అనస్థీషియా, న్యూరోసర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించా లని నిర్ణయించారు.

ఈనెల 25న సుమారు 4 గంటల పాటు శ్రమించి ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ఎడమ కన్నుతో పాటు, ముఖ భాగంలోని మాగ్జి లా ఎముకను తెరిచి ఫంగస్‌ను తొలగించారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాలను కొంతమేర తొలగించి, శుభ్రపరిచారు. ప్రస్తు్తతం రోగి కోలుకుంటున్నాడు. బ్లాక్‌ఫంగస్‌ నియంత్రణకు పొసకొనజోల్‌ మందు ఇచ్చామని, ఇది అద్భుతంగా పనిచేసిందని వైద్యులు చెప్పారు. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ ద్వా రా ఆయా భాగాలను పునరుద్ధరిస్తామన్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ప్లాస్టిక్‌ సర్జరీ, ఆప్తా ల్మాలజీ హెచ్‌ఓడీలు సుబోధ్‌కుమార్, రవిశేఖర్, పలు విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు. 
 చదవండి: ఈ–పాస్‌ ఇలా తీసుకోండి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top