తండ్రి జ్ఞాపకార్థం తుక్కుగూడలో ఫ్రీ అంబులెన్స్‌ సేవలు | Sakshi
Sakshi News home page

ముప్పిడి నారాయణ గౌడ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఫ్రీ అంబులెన్స్‌ సేవలు

Published Sun, Nov 13 2022 6:09 PM

Free Ambulance In Tukkuguda Under Muppidi Narayana Goud Trust - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ముప్పిడి నారాయణ గౌడ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రజలకు లైఫ్‌ సపోర్ట్‌ కలిగిన ప్రత్యేక అంబులెన్స్‌ను అందించారు ట్రస్ట్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌. తుక్కుగూడ ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు ఈ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి స్వర్గీయ ముప్పిడి నారాయణ గౌడ్‌.. తుక్కుగూడ బొడ్రాయి, మంకాలమ్మ దేవాలయం, అండర్‌ గ్రౌండ్‌ ‍డ్రైనేజీ, మార్కెట్‌ యార్డ్‌ సహా గ్రామ అభివృద్ధికి 35 ఏళ్లపాటు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. 

ముప్పిడి నారాయణ గౌడ్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలకు ఎమర్జెన్సీలో ఉపయోగపడే విధంగా ఉచిత అంబులెన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు శ్రీనివాస్‌ గౌడ్‌. 24 గంటల పాటు ఈ అంబులెన్స్‌ అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా 7416718585 నెంబర్‌కి కాల్ చేసి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లు హేమలత రాజు గౌడ్, రాజమోణి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ రఘురామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణ్మయి శ్రీధర్ గౌడ్, పూజారులు ప్రవీణ్ శర్మ, ప్రదీప్ శర్మ, ప్రభాకర్  గౌడ్, శంకరయ్య, వెంకటస్వామి గౌడ్, బాలరాజు గౌడ్, హరినాథ్, రమేష్ శ్రీధర్ మాజీ సర్పంచ్ నరసింహ ముదిరాజ్, మల్లేష్ గౌడ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్‌.. ప్రాపర్టీ కూల్చివేత

Advertisement
 
Advertisement
 
Advertisement