సిద్ధిపేట: పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌, 120 మంది విద్యార్థులకు అస్వస్థత | Food Poison At Siddipet Minority Residential School, 120 Students Taken Ill | Sakshi
Sakshi News home page

Food Poisoning: సిద్ధిపేట మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 120 మంది విద్యార్థులకు అస్వస్థత

Jun 27 2022 9:05 PM | Updated on Jun 27 2022 9:38 PM

Food Poison At Siddipet Minority Residential School, 120 Students Taken Ill - Sakshi

సాక్షి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. దాదాపు 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. గోప్యంగా ఉంచిన అధికారులు, కొంత మంది  విద్యార్థుల పరిస్థితి విషమించడంతో హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


చదవండి: భారమైన స్టూడెంట్‌ బస్‌పాస్‌ చార్జీలు.. ఐదు కిలో మీటర్లకు రూ.35, పాత, కొత్త చార్జీలు ఇలా!

Advertisement
 
Advertisement
Advertisement