ఫ్లిప్‌కార్ట్‌లో సెర్ప్‌ ఉత్పత్తులు

Flipkart Joins Hands To Enable Market Access For FPOs SHGs In Telangana - Sakshi

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో కుదిరిన ఒప్పందం

ఆన్‌లైన్‌లో 130 రకాల వస్తువులు

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫుడ్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఫ్‌పీవోలు), స్వయం సహాయక సంఘాల పంట ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి ఆన్‌లైన్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ(సెర్ప్‌) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. శనివారం ఇక్కడి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పంట ఉత్పత్తు లను ఇన్నాళ్లూ ఇక్కడే అమ్ముకోవాల్సి వచ్చేదని, తాజా ఒప్పందం వల్ల అవి ఇప్పుడు దేశంలోని 40కోట్ల మంది ఫ్లిప్‌కార్ట్‌ వినియోగ దారులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎఫ్‌పీవోలు రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసి ఫ్లిప్‌కార్ట్‌కు అమ్ముతుండటం వల్ల దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోతుందని, రైతులకు తగిన ధర లభించడంతోపాటు వినియోగదారుడికీ చౌకగా ఉత్పత్తులు అందుతాయని అన్నారు.

130 రకాల వస్తువు లను ఈ ఒప్పందంలో భాగంగా మహిళా సంఘాలు విక్రయిస్తా యని చెప్పారు. ఈ ఒప్పందం మహిళల సాధికారతకు ముందడుగు అని ఫ్లిప్‌కార్ట్‌ గ్రాసరీ విభాగపు వైస్‌ ప్రెసిడెంట్‌ స్మృతి రవిచంద్రన్‌ అన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సర కులు అందించగలమన్న ధీమాను స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యక్తం చేశారని, రాష్ట్రమంతా తిరిగి చర్చలు జరిపిన తర్వాతే ఈ ఒప్పందం సిద్ధమైందని చెప్పారు.

పంట ఉత్పత్తుల నాణ్యతను కాపాడుతూ వాటిని వినియోగదారులకు అందించేం దుకు ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే దాదాపు పదివేల మంది రైతులకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సెర్ప్‌ సీఓఓ రజిత నార్దెల్ల పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top