బాల్కనీ కుప్పకూలి.. ఇద్దరు బలి | Father And Son Killed As Balcony Collapses In Punjagutta, One Critically Injured | Sakshi
Sakshi News home page

బాల్కనీ కుప్పకూలి.. ఇద్దరు బలి

Mar 23 2026 8:32 AM | Updated on Mar 23 2026 9:15 AM

father son die balcony collapse hyderabad begumpet

పంజగుట్ట: రెండో ఫ్లోర్‌లోని బాల్కనీ కూలి తండ్రి, కొడుకు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంబాగ్‌కు చెందిన దేవిదాస్‌ (56), ఆయన కుమారుడు వివేక్‌ (32) ఎలక్ట్రిషన్‌లు. వీరు కాంట్రాక్ట్‌ తీసుకుని పనులు చేస్తుంటారు. బేగంపేటలోని కుందన్‌బాగ్‌ మెథడిస్ట్‌ కాలనీకి చెందిన ద్వారకా ప్రసాద్‌ వీరికి ఎలక్ట్రిక్‌ పనులు ఇప్పిస్తుంటారు. 

ద్వారకా ప్రసాద్‌ ఉంటున్న ఇల్లు పురాతన కాలం నాటిది. ఈ భవనం రెండో అంతస్తులో ఆయన నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో ఎలక్ట్రిక్‌ పనులు చేయించేందుకు శనివారం దేవిదాస్, వివేక్‌లతో బాల్కనీ లిఫ్ట్‌ పక్కనే నిల్చొని మాట్లాకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలింది. దీంతో ముగ్గురూ రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తు బాల్కనీపై పడి అది కూడా కూలడంతో నేలపై పడిపోయారు. 

దీంతో దేవిదాస్, వివేక్‌ తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలు కావడంతో ద్వారకా ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దేవిదాస్, వివేక్‌ల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. దేవిదాస్‌ అల్లుడు నవీన్‌ ధర్మశాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబాన్ని పోషిస్తున్న ఇద్దరు మృత్యువాత పడటంతో దేవిదాస్‌ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement