బాహుబలిని తలపించే ఫేక్‌ వీడియో వైరల్‌

Fake Viral Photo Of Man Crossing Rivulet And Carrying Toddler In Asifabad - Sakshi

సాక్షి, జైనూర్‌(ఆసిఫాబాద్‌): సోషల్‌ మీడియాలో ఓ ఫేక్‌ వీడియో జిల్లావాసులను కాసేపు గందరగోళానికి గురిచేసింది. జైనూర్‌ మండలం చింతకర్రకు చెందిన ఓ పసికందు తీవ్ర జ్వరంతో  బాధపడుతుండగా, వైద్యం కోసం వాగు దాటిస్తున్నట్లు ఈ వీడియో, ఫొటోలో ఉంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఇలాంటి ఇక్కట్లు తప్పడం లేదంటూ సదరు పోస్టు ఉద్దేశం. ఈ పోస్టు అనేక గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. బాహుబలి సినిమాను తలపిస్తూ పసికందును వాగు దాటిస్తుండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొద్ది సేపటికే అది ఫేక్‌ అని తేలింది. చింతకర్రకు వాగు కష్టాలు ఉన్నా గత వారం రోజులుగా ఇలాంటి పరిస్థితి ఏమీ లేదని గ్రామస్తులు, అధికారులు పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన వీడియో, ఫొటో 2006లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినదిగా తెలుస్తోంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్సై తిరుపతి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top