భారీగా మారిన ఇంజనీరింగ్‌ ఆప్షన్లు | Engineering options have changed drastically | Sakshi
Sakshi News home page

భారీగా మారిన ఇంజనీరింగ్‌ ఆప్షన్లు

Jul 24 2026 4:31 AM | Updated on Jul 24 2026 4:31 AM

Engineering options have changed drastically

రెండో దశ సీట్లు కేటాయించిన సాంకేతిక విద్యా మండలి  

వివిధ బ్రాంచీల్లో 14,257 సీట్ల మిగులు 

ఈ నెల 31 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ రెండో దశ సీట్ల కేటాయింపును సాంకేతిక విద్యా మండలి గురువారం వెల్లడించింది. కౌన్సెలింగ్‌లో మొత్తం 176 కాలేజీలు పాల్గొన్నాయి. కసాంకేతిక విద్యా మండలినర్‌ కోటా కింద 94,424 సీట్లు అందుబాటులో ఉంటే.. 80,167 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 14,257 సీట్లు వివిధ బ్రాంచీల్లో మిగిలిపోయాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 28లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.ఈ నెల 31 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ చేపడతారు. 

అయితే మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలో పెద్ద ఎత్తున ఆప్షన్లు మార్చుకున్నారు. వేరే కాలేజీలు, వేరే బ్రాంచీలను ఎంపిక చేసుకున్నారు. 34,838 మంది ఆప్షన్లు మార్చుకోగా, 37,442 మంది తమ ఆప్షన్లు కొనసాగించారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో వచి్చన సీట్లలోనే చేరారు. చాలామందికి ఈ దఫా కౌన్సెలింగ్‌లో మెరుగైన కాలేజీలు, బ్రాంచీలు లభించాయి. టాపర్లు కొంతమంది ప్రైవేటు కాలేజీలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు. దీంతో బ్రాంచీల మార్పునకు మార్గం సుగమమైంది.  

కంప్యూటర్‌ కోర్సుల వైపే 
రెండో దశ సీట్ల కేటాయింపు తర్వాత 88 శాతం కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ ఎమర్జింగ్‌ కోర్సుల్లో సీట్లు భర్తీ అయ్యాయి. 66,482 సీట్లు ఈ బ్రాంచీల్లో ఉంటే, 58,364 సీట్లు కేటాయించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సీఎస్‌ఈ (నెట్‌వర్క్‌), రోబోటిక్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచీల్లో 46 సీట్లు ఉంటే అన్నీ భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈ సైబర్‌ సెక్యూరిటీలో కూడా 1,995 సీట్లకు 1,918 సీట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, అండ్‌ ఎలక్ట్రికల్  బ్రాంచీల్లో 18,805 సీట్లు ఉంటే, 15,109 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్‌ అనుబంధ బ్రాంచీల్లో 7918 సీట్లు అందుబాటులో ఉంటే, 5,848 సీట్లు భర్తీ అయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement