New Type Of Cyber Attack In Hangar Technology Company At Cyberabad - Sakshi
Sakshi News home page

ఏం తెలివిరా నాయనా.. సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్‌ అటాక్‌ 

Oct 12 2022 9:44 AM | Updated on Oct 12 2022 11:02 AM

Employees Cyber Attack On Own Company In Cyberabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్‌ అటాక్‌ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు సొంత కం​పెనీకి చెందిన ఉద్యోగులే దారుణానికి ఒడిగట్టారు. కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్‌ దాడులు చేశారు. 

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ హాంగర్‌ టెక్నాలజీ సంస్థపై సైబర్‌ దాడులు జరిగాయి. కంపెనీపై సైబర్‌ దాడి చేసి కేటుగాళ్లు డేటాను చేజిక్కించుకున్నారు. ​కాగా, గత కొన్నేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులే సైబర్‌ అటాక్‌ చేసినట్టు సమాచారం. హాంగర్‌ కంపెనీ ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం, కంపెనీ ఉద్యోగులు విజయ్‌కుమార్‌, కరణ్‌కుమార్‌, అశ్వంత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. కాగా, నిందితుల నుంచి రివాల్వర్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక, అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement