బంగారంతో పోలిస్తే డైమండ్‌ ధరల్లో స్థిరత్వం ఉంటుంది : అనంత నారాయణ | Diamond prices are more stable compared to gold | Sakshi
Sakshi News home page

బంగారంతో పోలిస్తే డైమండ్‌ ధరల్లో స్థిరత్వం ఉంటుంది : అనంత నారాయణ

Jun 6 2026 10:13 AM | Updated on Jun 6 2026 10:17 AM

Diamond prices are more stable compared to gold

హైదరాబాద్‌ : బంగారం ధరలతో పోలిస్తే డైమండ్‌ ధరల్లో ఎక్కువగా స్థిరత్వం ఉంటుందని దమాస్‌ జ్యువెలరీ సీఈవోఓ అనంత నారాయణ హరిహరన్‌ అన్నారు. ఇర్రంమంజిల్‌లోని ప్రణవ వన్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌జీఎల్‌ డైమండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీ అయిన ఎమరాల్డ్‌ అధినేత శ్రీనివాసన్‌తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రాల అమ్మకాల్లో దేశంలోని టాప్‌–5 నగరాల్లో హైదరాబాద్‌ ఉందని అన్నారు. ఇటువంటి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల వల్ల వజ్రాల నాణ్యత, గ్రేడింగ్‌ పరిశీలించుకునేందుకు వినియోగదారులకు ఎంతో సులభంగా ఉంటుందని ఇది మరింత పారదర్శకతకు ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్‌జీఎల్‌ సంస్థ డైరెక్టర్‌ చిరాగ్‌ సోని మాట్లాడుతూ సౌత్‌ ఇండియాలోనే ఇది అతి పెద్ద ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ అని ఈ సెంటర్‌లో డైమండ్‌ యొక్క క్వాలిటీతో పాటు గ్రేడింగ్‌ను పరీక్షించుకోవచ్చుని తెలిపారు.

సామాన్యులు ఎవరైనా కూడా ఈ సెంటర్‌ను అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకొని వచ్చి డైమండ్‌ను ఏ విధంగా పరీక్షిస్తారు. ఎలా గ్రేడింగ్‌ చేస్తారు అనే విషయాలను తెలుసుకోవచ్చునని అన్నారు. ఇది డైమండ్‌ గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే ఆటోమెటిక్‌ గ్రేడింగ్‌ సిస్టమ్‌తో డైమండ్‌ నాణ్యతను కొలుస్తున్నప్పటికీ ఏఐ వల్ల మరింత లోతుగా విశ్లేషించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీల్‌ సహ వ్యవస్థాపకురాలు షిరిన్‌ బందుకాల్వ, నేషనల్‌ హెడ్‌ వరుణ్‌ శెట్టి, వసుంధర డైమండ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ వసుంధర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement