స్విగ్గీపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Delivery Boys Alleges On Swiggy Over Commission Pay At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్‌ నిరసన వ్యక్తం చేశారు. స్విగ్గి కంపెనీ యాజమాన్యం తమకు కమిషన్ తక్కువగా ఇస్తోందని మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా మంగళవారం ఆందోళన నిర్వహించారు. గతంలో 2 కిలోమీటర్ల పరిది లోపు ఒక డెలివరీ ఐటెమ్‌కు 35 రూపాయల కమిషన్ ఇస్తున్న సంస్థ ప్రస్తుతం భారీగా కోత విధించిందని తెలిపారు. ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దూరం పెరడంతో రోజుకి 200 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. స్విగ్గీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతోందని స్విగ్గి డెలివరీ బాయ్స్  ఆరోపించారు. థర్టీ పార్టీకి ఎక్కువ కమిషన్ ఇస్తూ తమకు మాత్రం తక్కువ కమిషన్ చెల్లిస్తోందని పేర్కొన్నారు. స్విగ్గీ మోసం చేస్తోందంటూ మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన స్విగ్గీ ప్రతినిధులు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామినిచ్చారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని డెలివరీ బాయ్స్ తెగేసి చెప్పారు.
(చదవండి: ఒక ఐడియా అత‌ని జీవితాన్ని మార్చేసింది)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top