నీటి కష్టాలు.. డెడ్‌ స్టోరేజ్‌కు నాగార్జునసాగర్‌ | Dead Level Water Storage In Nagarjuna sagar project | Sakshi
Sakshi News home page

నీటి కష్టాలు.. డెడ్‌ స్టోరేజ్‌కు నాగార్జునసాగర్‌

Mar 16 2025 9:02 AM | Updated on Mar 16 2025 9:35 AM

Dead Level Water Storage In Nagarjuna sagar project

సాక్షి, నల్లగొండ: నల్లగొండ‌ జిల్లాలోని‌ ప్రధాన జలాశయాల్లో ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. నాగార్జున సాగర్‌లో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. మరో తొమ్మిది అడుగులు తగ్గితే.. నీటి మట్టం 18 టీఎంసీలు తగ్గి డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకుంటుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 148 టీఎంసీలుగా ఉంది.

వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. మరో వారం, పది రోజుల్లోనే సాగర్‌ డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సాగర్‌లో నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 519 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 148 టీఎంసీలుగా ఉంది. రోజుకో టీఎంసీన్నర చొప్పున ప్రాజెక్టులో తగ్గుతున్న నీళ్లు తగ్గిపోతున్నాయి. మరోవైపు.. పంటల సాగుకు ఇంకా 20 నుంచి నెల రోజుల పాటు నీళ్లు అవసరం కానున్నాయి.

ఈ క్రమంలో సాగర్‌లో నీటి మట్టం అటు రైతులను, ఇటు అధికారులను టెన్షన్‌ పెడుతోంది. ప్రాజెక్టులో నీళ్లు ఈ స్థాయిలో తగ్గితే తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సాగర్ ప్రాజెక్టు నుంచే హైదరాబాద్ జంట నగరాలకు, నల్లగొండ జిల్లాకు తాగునీటి‌ సరఫరా జరుగుతోంది.

మూసీ పరిస్థితి ఇది..

  • మూసీ ప్రాజెక్టులో క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం

  • పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు

  • ప్రస్తుతం: 630 అడుగులు

  • పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలు

  • ప్రస్తుతం: 1.44 టీఎంసీలు


పులిచింతలలో ఇలా..

  • పూర్తిస్థాయి నీటిమట్టం: 175 అడుగులు

  • ప్రస్తుతం: 166 అడుగులు

  • పూర్తిస్థాయి నీటి‌ సామర్థ్యం: 45 టీఎంసీలు

  • ప్రస్తుతం: 33 టీఎంసీలు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement