రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రిహార్సల్స్‌ పరిశీలన  | CS Somesh Kumar Inspects The Rehearsal For State Formation Day | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రిహార్సల్స్‌ పరిశీలన 

Jun 1 2022 1:29 AM | Updated on Jun 1 2022 1:29 AM

CS Somesh Kumar Inspects The Rehearsal For State Formation Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల డ్రెస్‌ రిహార్సల్స్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ జూన్‌ 2న పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గన్‌ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌కు చేరుకొని పోలీస్‌ దళాల వందనం స్వీకరిస్తారు.

అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్స్‌ను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పరిశీలించారు. కోవిడ్‌–19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement