రోడ్లపై మొసళ్ల సంచారం.. భయాందోళనలో ప్రజలు

Crocodiles on Roads in Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: నీళ్లలో ఉండాల్సిన మొసళ్లు రోడ్లపైకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మావాల బైపాస్‌ రోడ్డుకు సమీపంలో మంగళవారం రాత్రి మొసలి రోడ్డు దాటుతూ కనిపించింది. ఆ సమయంలో జాతీయ రహదారికి దగ్గరలోని దాబా వైపు వెళ్తున్న కొందరు యువకులు గడ్డి పొదల్లో నుంచి మొసలి రోడ్డు దాటుతుండటాన్ని గమనించారు. ఆ సమయంలో మోటార్‌ బైక్‌ శబ్ధానికి మొసలి పొదల్లోకి జారుకుంది. అయితే నీళ్లలో ఉండాల్సిన మొసలి రోడ్డుపై సంచరిస్తుడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  

చదవండి: (మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top