JCB Slips From Tractor Kills Few In Nizamabad - Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌: ప్రాణాలు తీసిన జేసీబీ.. ట్రాక్టర్‌ నుంచి జారిపోయి కారు మీద పడి..

Mar 29 2023 7:17 AM | Updated on Mar 29 2023 11:54 AM

Crime News: JCB Slips From Tractor Kills Few In Nizamabad - Sakshi

ముందు వెళ్తోంది మృత్యువాహనమని.. పాపం ఆ డ్రైవర్‌ పసిగట్టలేకపోయాడు

సాక్షి, నిజామాబాద్: మృత్యువు ఎప్పుడు ఎలా దూసుకొస్తుందో చెప్పలేం. ముందు వెళ్తోంది మృత్యువాహనమని.. పాపం ఆ డ్రైవర్‌ పసిగట్టలేకపోయాడు. మంగళవారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్‌ నుంచి జేసీడీ ఊడిపోయి.. ఓ కారు మీద పడి పలువురి ప్రాణాలు బలిగొంది. 

భీంగల్ జూనియర్ కాలేజ్ వద్ద ట్రాక్టర్ పై జేసీబీ తీసుకెళ్తుండగా.. వెనకవస్తున్న కారుపై పడింది జేసీబీ. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలో మరొకరు కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీళ్లంతా మోర్తాడ్‌కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement