ప్లాస్మా దాతలకు సత్కారం

CP Sajjanar And Vijay Devarakonda Honored Plasma Donaters Hyderabad - Sakshi

గచ్చిబౌలి: ప్లాస్మా దాతలకు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఘనంగా సత్కరించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సినీ హీరో విజయ్‌దేవరకొండ, సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఘనంగా సన్మానించారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 126 మంది ప్లాస్మాయోధులు/ ప్లాస్మావారియర్స్‌(హీరోయిక్‌ వారియర్స్‌)ను సత్కరించారు. అనంతరం ప్లాస్మాదాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. (ప్లాస్మా దాతలకు రూ.5 వేలు)

ప్లాస్మా దానంతో ప్రాణదానం 
ప్లాస్మా దానం చేసి కోవిడ్‌ బాధితులను రక్షించాల్సిన అవసరం ఉందని సినీహీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్లాస్మా ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రస్తుత తరుణంలో ప్లాస్మా దానం  ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేయాలని కోరారు. కరోనా కేసుల కంటే ప్లాస్మా దానాల సంఖ్య ఎక్కువగా ఉండా లన్నారు. రక్త, ప్లాస్మాదానంపై సైబరాబాద్‌ పోలీసులు చేస్తున్న కృíషి ఎనలేనిదన్నారు.     –సినీహీరో విజయ్‌దేవరకొండ 

కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌ దేవరకొండ, సీపీ సజ్జనార్‌    
రక్తదానం ప్రేరణతోనే ప్లాస్మా డొనేషన్‌ డ్రైవ్‌  
 సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మాట్లాడుతూ రక్తదానం కోసం నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌ ప్రేరణతోనే ప్లాస్మా డొనేషన్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టామన్నారు. ప్లాస్మాదానం సామాజిక బాధ్యతగా కావాలని, ప్లాస్మా దాతలు ప్రాణదాతలుగా నిలుస్తున్నారన్నారు. వారం రోజుల్లో సైబరాబాద్‌ పోలీసులు 1000 మంది డేటాబేస్‌ సేకరించారని, దాతలు, గ్రహీతల రక్తంతో సరిపోలడం అంత సులభం కాదన్నారు. ప్లాస్మా మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసం చేసేవారి వివరాలు తెలిస్తే వెంటనే 9490617444కు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్, ఎస్‌సిఎస్‌సి ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల ప్రసంగించారు. అనంతరం విజయ్‌దేవరకొండ, సజ్జనార్‌ చేతుల మీదుగా ప్లాస్మాదానం పై రూపొందించిన వాల్‌పేపర్స్, ఆన్‌లైన్‌ పోర్టల్‌ లింక్, ఫోన్‌ నంబర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏడీసీపీ మానిక్‌రాజ్, ఏడీసీపీ మాదాపూర్‌ వెంకటే«శ్వర్లు, ఏడీసీపీ క్రైమ్‌ ఇందిరాన, ట్రాఫిక్‌ ఫోరమ్‌ ప్రతినిధి వెంకట్‌టంకశాల తదితరులు పాల్గొన్నారు. –సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-08-2020
Aug 04, 2020, 05:30 IST
ముంబై: భారీ వ్యాల్యుయేషన్లు, పెరిగిపోతున్న కరోనా కేసుల భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో స్టాక్‌ మార్కెట్‌ వరుసగా...
04-08-2020
Aug 04, 2020, 05:11 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 నేపథ్యంలో దేశంలో రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పడిపోయింది....
04-08-2020
Aug 04, 2020, 04:54 IST
న్యూయార్క్‌: అమెరికాలో శతాబ్దాలుగా కొనసాగుతున్న రిటైల్‌ దిగ్గజ సంస్థలు కరోనా వైరస్‌ దెబ్బతో మూతబడుతున్నాయి. రోజురోజుకూ ఈ లిస్టు గణనీయంగా...
04-08-2020
Aug 04, 2020, 04:35 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కరోనా పరీక్షలు 21 లక్షలు దాటాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9...
04-08-2020
Aug 04, 2020, 03:58 IST
జెనీవా: కరోనా వైరస్‌ టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య...
04-08-2020
Aug 04, 2020, 03:38 IST
న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి....
04-08-2020
Aug 04, 2020, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో గడప దాటాలన్నా, బహిరంగ మార్కెట్లకు వెళ్లి కూరగాయలు కొనాలన్నా జనం జంకుతున్నారు....
04-08-2020
Aug 04, 2020, 02:10 IST
లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌) : నిజామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో కోవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి. మొదటి దశ...
04-08-2020
Aug 04, 2020, 01:46 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా సామాజిక వ్యాప్తి జరగడం, గ్రామా ల్లోనూ వైరస్‌ ఘంటికలు మోగడంతో సర్కారు అప్రమత్తమైంది. దీంతో...
03-08-2020
Aug 03, 2020, 23:45 IST
ఒక సమస్య ఎదురైంది... అంటే, ఆ సమస్యకు పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఆ పరిష్కారం ఎక్కడ ఉందోననే...
03-08-2020
Aug 03, 2020, 17:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తనకు కరోనా సోకినట్లు ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేసిన...
03-08-2020
Aug 03, 2020, 16:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ఎవరిని వదిలి పెట్టడం లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ...
03-08-2020
Aug 03, 2020, 16:41 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే...
03-08-2020
Aug 03, 2020, 15:46 IST
సాక్షి, కరీంనగర్‌, సిరిసిల్లా: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్లాస్మా దానం చేయడానికి‌ ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ...
03-08-2020
Aug 03, 2020, 15:23 IST
తాను వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు ఛాతిలో భయంకరపైన నొప్పితో బాధ పడ్డానని, తాను బతుకుతానని ఏ కోశానా నమ్మకం కలగలేదని ఆమె స్థానిక మీడియాకు...
03-08-2020
Aug 03, 2020, 15:04 IST
ఇప్పటివరకు కోవిడ్‌ బాధితుల ఫోన్‌ నెంబర్లు మాత్రమే రిజిస్టర్‌ చేస్తున్నారని, బాధితుడు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు సమాచారం అందడంలేదని తెలిపారు.
03-08-2020
Aug 03, 2020, 13:39 IST
లబ్బీపేట(విజయవాడతూర్పు): కోవిడ్‌–19 స్టేట్‌ హాస్పటల్‌లో  నాల్గవ తరగతి సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోగుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు, డబ్బులు...
03-08-2020
Aug 03, 2020, 13:10 IST
ఎల్లారెడ్డిరూరల్‌(ఎల్లారెడ్డి): కరోనాతో ఉపాధి లేక ఓ వ్యక్తి ఆకలితో మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు...
03-08-2020
Aug 03, 2020, 12:48 IST
రాజానగరం (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ కోవిడ్‌ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్‌ సోకిన రిమాండ్‌ ఖైదీ...
03-08-2020
Aug 03, 2020, 12:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఊరటనిచ్చే ఒక శుభపరిణామం చోటు చేసుకుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top