బీఆర్‌కేఆర్‌ భవన్‌: కరోనా వచ్చిన విషయం దాచి.. | Coronavirus Spreading In BRKR Bhavan At Hyderabad | Sakshi
Sakshi News home page

బీఆర్‌కేఆర్‌ భవన్‌: కరోనా వచ్చిన విషయం దాచి..

Mar 30 2021 1:32 PM | Updated on Mar 30 2021 2:26 PM

Coronavirus Spreading In BRKR Bhavan At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో కరోనా కలకలం రేపుతోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి అధికారులు ఆఫీసుకు వచ్చినట్లు సమాచారం. గడిచిన వారం రోజుల్లో పదుల సంఖ్యలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు నమోదుకావటంతో మిగతా ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవండ వల్లే  బీఆర్‌కేఆర్‌ భవన్‌లో కరోనా కేసులు పెరగుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: కట్టడి లేని కరోనా.. విజృంభిస్తున్న మహమ్మారి

Advertisement
 
Advertisement
Advertisement