గాంధీలో పెరుగుతున్న కరోనా కేసులు 

Coronavirus Cases Increasing In Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఐసీయూలో ప్రస్తుతం 136 మంది కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ప్రధాన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ట్రైయాజ్‌ ఏరియా, రెండు, మూడు అంతస్తుల్లో 300 పడకలతో కోవిడ్‌ ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు.ప్రాణాపాయస్థితిలో ఉన్న కోవిడ్‌ బాధితులకు మాత్రమే ఐసీయూలో వైద్యసేవలు అందిస్తున్నామని, కోవిడ్‌ పాజిటివ్‌ ఉండి ఎటువంటి రుగ్మతలు లేనివారిని కింగ్‌కోఠి, టిమ్స్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నామని వివరించారు. సెకండ్‌వేవ్‌లో కోవిడ్‌ బాధితులతోపాటు మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు ఆస్పత్రికి చెందిన ఓ అధికారి వాఖ్యానించడం గమనార్హం. 

ప్రత్యేక కరోనా మార్చురీ ఏర్పాటు..  
గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రత్యేక కరోనా మార్చురీని గురువారం అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్, నాన్‌కోవిడ్‌ రెండు రకాల వైద్యసేవలు అందిస్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత మార్చురీ పక్కన గల బయోమెడికల్‌ వేస్టేజీ పాంట్ల్‌ను కరోనా మార్చురీగా ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top