Viral: Cockroach Found In Biryani At Warangal, Restaurants Fined Rs 15 Thousand - Sakshi
Sakshi News home page

Cockroach In Biryani: బిర్యానీలో బొద్దింక

Dec 28 2022 1:17 PM | Updated on Dec 28 2022 5:09 PM

Cockroach Found In Biryani At Warangal Restaurants - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ హంటర్‌ రోడ్డులోని అవంత గ్రాండ్‌ హోటల్‌ నిర్వాహకుల అజాగ్రత్త వల్ల బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అవంత గ్రాండ్‌ హోటల్‌కు బిర్యానీ తినేందుకు కొంత మంది యువకులు మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. వారికి వడ్డించిన బిర్యానీలో బొద్దింక కనిపించింది. దీంతో బల్దియా ఎంహెచ్‌ఓ రాజేష్‌కు ఫిర్యాదు చేశారు.

బల్దియా అధికారులు అక్కడికి చేరుకుని బిర్యానీని పరిశీలించి హోటల్‌ నిర్వాహకులకు రూ.15వేల జరిమానా విధించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపారు. ఆ తర్వాత అదే యువకులపై హోటల్‌ నిర్వాహకులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
చదవండి: వెజ్‌ బిర్యానీలో మాంసం బొక్కలు ప్రత్యక్షం.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే..

Advertisement
 
Advertisement
Advertisement