
నిజనిజాలను నిగ్గు తేల్చాలని డీజీ పూర్ణచంద్రరావుకు ఆదేశాలు ఇచ్చారు
సాక్షి, హైదరాబాద్: మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సుమారు 100 ఎకరాల భూమిని ఈటల జమునా హ్యచరీస్ కోసం కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించారు. ఈటల భూకబ్జా ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. కలెక్టర్ ద్వారా సమగ్ర రిపోర్ట్ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్.. నిజనిజాలను నిగ్గు తేల్చాలని డీజీ పూర్ణచంద్రరావుకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలని కేసీఆర్ డీజీని ఆదేశించారు.