దసరాపై ఉత్కంఠ.. మునుగోడులో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

CM KCR Interesting Comments On National Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. జాతీయ పార్టీ విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌.. మంత్రులు, జిల్లాలో అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో తాజా రాజకీయాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఇక, ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఈ సమావేశంలో డిసెంబర్‌ 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్‌ భారీ బహిరంగ సభకు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, తెలంగాణభవన్‌లో దసరా రోజున టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. అదే రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. మరోవైపు.. జాతీయ స్థాయిలో వివిధ సంఘాల నేతలతో త్వరలో కేసీఆర్‌ భేటీ కానున్నట్టు తెలిపారు. 

ఈ క్రమంలోనే మునుగోడుపై కూడా కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల బరిలో ఉంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో అన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. మునుగోడులో అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి.  మునుగోడు ఉప​ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top