ప్రగతి భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం | CM KCR Hoists National Flag At Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Jan 27 2023 12:43 AM | Updated on Jan 27 2023 2:48 PM

CM KCR Hoists National Flag At Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గురువారం ప్రగతి భవన్‌లో జాతీయ పతాకా విష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్తూపాన్ని సందర్శించి జ్యోతి ప్రజ్వలన చేయడంతో పాటు అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్‌ రాజు, మధు సూదనాచారి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, సీఎంవో ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement