TSPSC: వార్షిక కేలండర్‌ ఓ సవాల్‌!

Challenge For Annual Notification To TSPSC - Sakshi

ఉద్యోగాల భర్తీకి శాఖల వారీగా పోస్టుల విభజన ప్రధాన అంశం

కొత్త జోన్ల ప్రకారం పోస్టుల విభజన తరువాతే నోటిఫికేషన్లు

లోపాలు లేని నోటిఫికేషన్లతోనే సమస్యలు దూరం

కొత్త టీఎస్‌పీఎస్సీ ముందున్న సవాళ్లెన్నో..

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టగా, ఆ తరువాత ఐదేళ్లకు అంటే 2017 మళ్లీ నియామకాలు చేపట్టారు. మళ్లీ నాలుగేళ్లకు ఇపుడు 10 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇక జూనియర్‌ లెక్చరర్ల నియామకాలైతే 2008లో జరిగా యి. ఆ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్‌కే దిక్కులేదు. 2011 తరువాత మళ్లీ గ్రూపు–1 నోటిఫికేషన్‌ లేదు. గ్రూపు–2, గ్రూపు–3 నోటిఫికేషన్లదీ అదే పరిస్థితి. ఇలా ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. ఫలితంగా నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతోంది. 

వార్షిక కేలండర్‌ అమలే అసలు మందు.. 
ప్రస్తుతం రాష్ట్రంలో 24.54 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వద్ద వన్‌టైమ్‌ రిజి్రస్టేషన్‌ చేసుకోగా, వారిలో వయోపరిమితి దాటిపోయిన వారు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాల భర్తీకి వార్షిక కేలండర్‌ అమలు చేస్తే వయోపరిమితి సమస్య రాదని నిరుద్యోగులు ఏళ్ల తరబడి చెబుతున్నారు. అలాచేస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెండు మూడు సార్లు ప్రయతి్నంచి, అవి లభించని వారు ఏదో ఒక ప్రై వేటు ఉద్యోగమో, ఉపాధి అవకాశమో వెతుక్కునే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే శాఖల వారీగా ఏ సంవత్సరంలో ఖాళీ అయ్యే పోస్టులను ఆ సంవత్సరంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను జారీ చేస్తే నిరుద్యోగులకు మేలు జరుగుందని టీఎస్‌పీఎస్సీ కూడా భావించింది. దీంతో మూడేళ్ల కిందటే టీఎస్‌పీఎస్సీ వార్షిక కేలండర్‌ అమలుకు ప్రతిపాదించినా మోక్షం లభించలేదు.

మరెన్నో సవాళ్లు...
ఉద్యోగాల భర్తీకి లోపాల్లేని నోటిఫికేషన్లు జారీచేయడం సహా అనేక అంశాలు, సవాళ్లు శుక్రవారం కొలువుదీరనున్న కొత్త కమిషన్‌ ముందున్నాయి. టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్‌గా నియమితులైన ఐఏఎస్‌ జనార్దన్‌రెడ్డి, సభ్యులు సమష్టిగా ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో ముందుకు సా గితేనే అవి పరిష్కారం కానున్నాయి. ఇందులో కొన్ని ప్రభు త్వం చేయాల్సిన పనులే అయినా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహకారం తీసుకొని వెంటపడితేనే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతాయి. ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న 50 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కార్యరూపం దాలుస్తుంది.

పోస్టుల విభజనే ప్రధానం
రాష్ట్రంలో 2018లోనే 31 జిల్లాలతో కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినా ఆ తరువాత ప్రభుత్వం మళ్లీ రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. వాటికీ రాష్ట్రపతి ఆమోదం లభించింది. అయితే ఇప్పుడు కొత్త జోన్లపై రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం రూల్స్‌ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని శాఖల్లో సరీ్వసు రూల్స్‌ మార్పు చేయాల్సి ఉంది. ఇందులో ఏ పోస్టు జిల్లా పరిధిలోకి వస్తుంది.. ఏది జోనల్‌ పోస్టు, ఏదీ మల్టీ జోన్‌ పోస్టు అన్నది తేల్చాల్సి ఉంది. గతంలో అవి తేలకపోవడంతోనే గ్రూపు–2, 3 నోటిఫికేషన్లను ఇవ్వలేదు. 

స్టేట్‌లెవల్‌ పోస్టుల రద్దును వ్యతిరేకిస్తున్న శాఖలు
రాష్ట్రంలో ఇప్పటివరకు స్టేట్‌ కేడర్‌ పోస్టులు ఉన్నాయి. 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచి్చన పుడే రాష్ట్రంలోని వారికే ఆ పోస్టులు దక్కాలని స్టేట్‌ కేడర్‌ను రద్దు చేసి, ఆ పోస్టులను మల్టీ జోన్‌ పరిధిలోకి తెస్తూ జీవో 124ను జారీ చేసింది. అయితే దానిని రెవెన్యూ, పోలీసు శాఖలు వ్యతిరేకిస్తున్నాయి. మల్టీ జోన్‌ పరిధిలోకి వెళితే అక్కడ 8 ఏళ్లు సరీ్వసు చేశాకే స్టేట్‌ కేడర్‌కు వస్తారు. అక్కడ 8 ఏళ్లు సరీ్వసు చేశాకే ఐఏఎస్, ఐపీఎస్‌కు కన్‌ఫర్డ్‌ అవుతారు. కాబట్టి వారు వ్యతిరేకిస్తున్నారు. అందుకు కమిషన్‌ చిత్తశుద్ధితో ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఒప్పించాలి. ఏ మల్టీ జోన్‌లో ఏ కేడర్‌ పోస్టులు ఎన్ని వస్తాయన్నది తేలి్చతేనే గ్రూపు–1 నోటిఫికేషన్‌ జారీకి మార్గం సుగమం అవుతుంది.

గ్రూపు-2 విషయంలోనూ.. 
గ్రూపు–2 విషయంలో శాఖల వారీగా పోస్టుల విభజన చేయాలి. అందులో ఏ జోన్‌లో ఎన్ని.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయన్నది తేల్చి పోస్టులను కేటాయించాలి. 5 శాతం ఓపెన్, 95 శాతం స్థానికులకు కేటాయిస్తూ సరీ్వసు రూల్స్‌ మార్పు చేయాలి. దీనికంటే ముందు కొత్త జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేసేలా చర్యలు చేపట్టాలి. ఆ తరువాత ఆయా జిల్లాల్లో శాఖల వారీగా కేడర్‌ స్ట్రెంత్‌ను నిర్ణయించాలి. 2018లో కొత్త జోనల్‌ సిస్టం రాగానే పోస్టుల విభజించి ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వానికి రాసింది. అయినా ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదు. గ్రూపు–3 విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top