తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం ప్రశంస | Central govt Praises Telangana for Paddy Grain Procurement | Sakshi
Sakshi News home page

వరి ధాన్యం సేకరణలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం ప్రశంస

Dec 30 2021 2:47 PM | Updated on Dec 30 2021 4:57 PM

Central govt Praises Telangana for Paddy Grain Procurement - Sakshi

సాక్షి, ఢిల్లీ: వరి ధాన్యం సేకరణలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. 2020-2021ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 894.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గత ఏడాదితో పోల్చితే ధాన్యం సేకరణ 15 శాతం పెరిగింది. గతం కంటే ఎక్కువ ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ‌తో పాటు పంజాబ్, బిహార్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లు ఉన్నాయి. 

1.31కోట్ల మంది రైతులకు కనీస మద్ధతు ధర ద్వారా రూ.1,68,849కోట్ల మేర లబ్ది చేకూరింది. 2021-22లో దేశవ్యాప్తంగా బుధవారం వరకు 472.47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు కేంద్రం పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement