Hyderabad: దొంగలు బాబోయ్‌! నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..

Bullet Bikes Hyderabad Theft Cases Beware While Parking Vehicles Outside - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బైక్‌ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒక వైపు చోరీలు చేస్తూనే పోలీసులకు చిక్కకుండా చాకచక్కంగా తప్పించుకుంటున్నారు. కొండాపూర్‌, మాదాపూర్‌ ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో చోటు చేసుకున్న చోరీలు పోలీసులను నివ్వెర పరుస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన కొన్ని కేసులు దొంగల తెలివితేటలకు అద్దం పడుతున్నాయి. మణిప్రసాద్‌ అనే వ్యక్తి గురువారం ఉదయం కొండాపూర్‌లో స్టైయిల్‌ హెయిర్‌ సెలూన్‌కు వెళ్లాడు. తరువాత బయటకు వచ్చి చూస్తే తన బుల్లెట్‌ బైక్‌ కనిపించలేదు.

సీసీ పుటేజీ పనిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై హెల్మెట్‌ పెట్టుకొని రెండు సార్లు రెక్కీ నిర్వహించి ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద తన ప్యాషన్‌ బైక్‌ పెట్టి నడుచుకుంటూ సెలూన్‌ దగ్గరకు వచ్చాడు. హ్యాండిల్‌ లాక్‌ చేయకపోవడంతో కొద్ది దూరం తోసుకుంటూ వెళ్లి స్క్రూ డ్రైవర్‌తో హెడ్‌లైట్‌ తీసి వైర్ల సహయయంతో స్టార్ట్‌ చేసి బుల్లెతో ఉడాయించాడు. 30 నిమిషాల తరువాత వచ్చి అపార్ట్‌మమెంట్‌ వద్ద ఉన్న తన ప్యాషన్‌ బైక్‌ను తీసుకొని పరారయ్యాడు. బుల్లెట్‌ దొంగ కోసం గచ్చిబౌలి పోలీసులు రెండు బృందులుగా దర్యాప్తు చేపట్టారు.  
చదవండి👉వైరాలో వింత చేపల వర్షం.. మునుపెన్నడూ చూడలేదే!

బుల్లెట్‌ని తోసుకుంటూ వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి

పార్క్‌ చేసిన బుల్లెట్లు మాయం... 
మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలోని పర్వత్‌నగర్‌లో నివాసముండే అఖిల్‌ రెడ్డి మే 26న  అర్థరాత్రి ఇంటి ముందు బుల్లెట్‌ పార్క్‌ చేశాడు. తెల్లవారు జామున  చూడగా బుల్లెట్‌ కనిపించలేదు. బాధి తుడు మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. 

నార్సింగి పీఎస్‌ పరిధిలోని పుప్పాల గూడలో ఓ ఇంటి ముందు పార్క్‌చేసిన బుల్లెట్‌ను నాలుగు రోజుల క్రితం చోరీ చేశారు. బాధితుడు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వరుసగా బుల్లెట్లు చోరీకి గురికావడం పోలీసులకు సవాల్‌గా మారింది.
చదవండి👉వర్కర్‌పై కర్కశత్వం.. ఒళ్లంతా బెల్టు వాతలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top