బాంబే సమాచార్‌.. రెండు శతాబ్దాల పయనం

Bombay Samachar To Complete its 200 years Journey - Sakshi

హైదరాబాద్‌: మన దేశంలో మొట్టమొదట ప్రారంభమైన పత్రికల్లో ఒకటైన ‘బాంబే సమాచార్‌’ త్వరలో 200వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. 1822లో గుజ రాతీ వారపత్రికగా మొద లైన బాంబే సమాచార్‌.. 1832లోనే బైవీక్లీ (వారానికి రెండు రోజులు)గా, 1855 నాటికి దినపత్రికగా మారింది. దేశంలో ఆంగ్లేతర పత్రికల్లో బెంగాల్‌కు చెందిన సమాచార్‌ దర్పణ్‌ మొదటిది కాగా.. రెండోది ‘బాంబే సమాచార్‌’ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న పత్రికలన్నింటిలో సుదీర్ఘ కాలంగా కొనసాగు తున్నది తమ పత్రికేనని, ప్రపంచవ్యాప్తంగా చూసినా తమ పత్రిక నాలుగో స్థానంలో ఉందని ముంబై సమాచార్‌ డైరెక్టర్‌ హొర్ముస్‌జి ఎన్‌ కామా తెలిపారు. పాఠకుడు కేంద్రంగా సమాచారం అందించడమే తమ పత్రిక విజయ రహస్యమని చెప్పారు.

ఈ సందర్భంగా బాంబే సమాచార్‌ డైరెక్టర్‌ హొర్ముస్‌జి ఎన్‌ కామాకు ఇండియన్‌ న్యూస్‌పేపర్స్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడు ఎల్‌.ఆదిమూలం అభినందనలు తెలియ జేశారు. 1933లో వివిధ కారణాలతో మూత పడే దశలో ఉన్న ఈ పత్రికను కామాజీల కుటుంబం టేకోవర్‌ చేసి నడిపించిందని గుర్తు చేశారు. పత్రికల మనుగడ కష్టతరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబం ‘బాంబే సమాచార్‌’ను విజయవంతంగా, ఒక మోడల్‌లా నిలిపి నడిపిస్తోందని ప్రశంసించారు. ఈ పత్రిక ఇంత సుదీర్ఘకాలం విజయవంతంగా నడవడం ఆ పత్రికకే కాకుండా మొత్తం పత్రికా రంగానికే గర్వకారణమన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top