
హైదరాబాద్: ఆషాఢమాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనంలో భాగంగా ఇప్పటికే మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి, రెండో బోనాన్ని విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి.. మూడో బోనాన్ని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, నాలుగో బోనాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించారు. అయిదో బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు.