breaking news
Ujjain Mahankali ammavari jathara
-
రేపు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్: ఆషాఢమాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనంలో భాగంగా ఇప్పటికే మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి, రెండో బోనాన్ని విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి.. మూడో బోనాన్ని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, నాలుగో బోనాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించారు. అయిదో బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. -
ఉజ్జయినీ అమ్మవారి ఘటం..!
లష్కర్ బోనాల పండుగ అనగానే కొత్త కుండలో ప్రత్యేకంగా వండిన ప్రసాద నైవేద్యం.. డప్పుల దరువులు.. పోతురాజుల వీరంగాలు.. ఫలహారపు బండ్ల ఊరేగింపులు.. రంగం ద్వారా భవిష్యవాణి వినిపించడం.. ఎక్కువగా ఇవే గుర్తుకొస్తాయి. కానీ.. జాతరలో ప్రతి ఇంటికీ వెళ్లి భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఘటం అత్యంత కీలకమైనది. ఈ నెల 29న ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలుతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 29 నుంచి జులై 12 వరకూ అమ్మవారి ఘటం భక్తులకు దర్శనం కోసం సికింద్రాబాద్ పురవీధుల్లో ఉరేగిస్తారు. అమ్మవారి ఘటాన్ని పొడవైన వెదురు బద్దలతో నిలువెత్తు ఆకారంతో.. పూలతో అందంగా తీర్చిదిద్దుతారు. నడుమ అమ్మవారి విగ్రహాన్ని అమర్చి ఆకర్షణీయంగా రూపొందించేదే ఘటం. ఒంటినిండా పసుపు పూసుకున్న వ్యక్తులు ఘటాన్ని అధిరోహించి.. తలపై ఉన్న ఘటం కిందపడకుండా డప్పుల వాద్యాలకు, దరువులకు అనుగుణంగా విన్యాసాలతో నాట్యమాడతారు. సాధారణంగా కనికట్టు విద్యలు చేసే వారు ఇటువంటి వాటిని ప్రదర్శించినా.. సుమారు 60 కిలోల బరువుతో కూడిన ఘటాన్ని కేవలం పసుపు ముద్ద.. తలచుట్టకు మధ్యన పెట్టి పడకుండా చూడాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌లో 15కు పైగా ఆలయాలకు సంబంధించిన అమ్మవారి ఘటాలు ఈ రకంగా 13 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాయి.సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాల వేడుకలు జులై 13 ఆదివారం బోనాలు, 14న రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందు కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. లష్కర్ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఎదుర్కోలు నుంచి జాతర ముగిసే వరకూ..ఆషాఢమాసం తొలి ఆదివారం ఈ నెల 29వ తేదీ ఆదివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉత్సవాల్లో పాల్గొంటుంది. అదే విధంగా సోమసుందరం వీధిలోని శ్రీ దేవి పోచమ్మ, కళాసిగూడలోని మాతా ముత్యాలమ్మ, శివాజినగర్‌లోని డొక్కలమ్మ, రెజిమెంటల్ బజార్‌లోని గండిమైసమ్మ, ఓరుగంటి ఎల్లమ్మ, సెకెండ్ బజార్‌లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, కుమ్మరిగూడలోని నల్లపోచమ్మ, ఆర్పీ రోడ్డులోని మావురాల పెద్దమ్మ వంటి అమ్మవారి ఘటాలు కూడా ఎదుర్కోలు ఉత్సవాల్లో వేర్వేరుగా పాల్గొంటాయి. ప్రధానంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటం బోట్స్‌క్లబ్ సమీపంలోని బుద్ధభవన్ ఎదురు వీధిలో ఉన్న మహంకాళమ్మ దేవాలయంలో రూపుదిద్దుకుంటుంది. ఆ తరువాత జులై 12 శనివారం రాత్రి వరకూ ఆయా బస్తీలు.. కాలనీల్లో ఊరేగుతూ భక్త జనుల పూజలు అందుకుంటాయి. 13 ఆదివారం బోనాల పండుగ రోజున ఉజ్జయిని మహాకాళి మినహా ఇతర ఘటాలు ఆనకట్ట ఉత్సవాల్లో పాల్గొంటాయి. 14వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం ముగిసిన తరువాత అమ్మవారి ఘటం వీడ్కోల ఉత్సవంలో పాల్గొంటుంది. దీంతో జాతర ముగుస్తుంది.ఘటం మొదలైంది ఇలా.. తొలినాళ్లలో ఘటం అనేది ఉండేది కాదు. ప్రధానంగా 1813లో సురిటి అప్పయ్య అనే మిలటరీ ఉద్యోగి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో నగరంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలారా వ్యాధి తగ్గితే.. సికింద్రాబాద్‌లో ఆలయాన్ని కడతానని మొక్కుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లో ఆషాఢంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆషాఢమాసంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేందుకు అమ్మవారి ఘటాన్ని మొదలుపెట్టారు.ఘటం అధిరోహకుల వేషధారణ.. ఘటం అధిరోహకులు కూడా ఘటం మాధిరిగా ప్రత్యేకంగా తయారవుతారు. ముఖ్యంగా పసుపులో తడిపిన పంచె ధరించి.. ఒంటి నిండా పసుపు పులుముకుని కళ్లకు కాటు.. కాళ్లకు గజ్జెలు ధరించి అమ్మవారి ఘటాన్ని అధిరోహిస్తుంటారు. వేపాకులతో కూడిన చన్నీళ్ల సాకతో ఘటం అధిరోహకుల కాళ్లను భక్తులు కడిగి మొక్కుతారు. (చదవండి: Telangana Bonalu : తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..) -
కోరినన్ని వర్షాలు కురుస్తాయి..
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రా బాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు సోమవారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్స వాల్లో రెండో ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.55 గంటల సమ యంలో అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరి గుడి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ‘ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలు, సాక, పూజలు నాకు ఆనందాన్ని చ్చాయి. కోరినన్ని వర్షాలు కురుస్తాయి. నా ప్రజలందరినీ బాగా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని నేను కాపా డుకుంటా. నా రూపాన్ని పెట్టాలనే సంకల్పాన్ని నెర వేర్చుకుంటా. నాకు శాశ్వత రూపం పెట్టా లని చూస్తున్నారు అది చేయండి, నాకు రక్తబలిని ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దాంతోనే నేను సంతోషంగా ఉన్నాను. అదే చాలు. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో సాక పెట్టండి. పంటల్లో ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు, వాటితో రోగాలు పెరిగిపోతున్నాయి, వాటి ని తగ్గించుకోండి. పిల్లలు, గర్భిణీలకు ఏ ఇబ్బంది రానివ్వను. అంద రినీ సంతోషంగా ఉండేలా చూసుకుంటా ను’అని అన్నా రు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్య దర్శి శైలజా రామయ్యర్, కమి షనర్ హన్మంతరావు, కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి, ఈవో మనోహర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.ఘనంగా అమ్మవారికి సాగనంపు..: బోనా లు, రంగం అనంతరం అమ్మవారి సాగనంపు కార్యక్రమాన్ని ఘనంగా చేప ట్టారు. అమ్మవారిని అంబారీపై ఉంచి, అమ్మవారి ఘటంతో సాగనంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో జాతర ముగిసింది. -
భక్తులు లేకుండా తొలిసారి అమ్మవారి బొనాల వేడుకలు
-
ఉత్సవ శోభ
మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర నేడు బోనాల సమర్పణ...రేపు ‘రంగం’ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. ఆదివారం బోనాలు సమర్పిస్తారు, సోమవారం ‘రంగం’ కార్యక్రమం ఉంటుంది. 48 గంటల పాటు అమ్మవారిని నిరంతరాయంగా దర్శించుకునే అవకాశంకల్పించారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. రాంగోపాల్‌పేట్: తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో జరిగే ఈ ఉత్సవాలకు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, సోమవారం ‘రంగం’ కార్యక్రమం ఉంటుంది. జంటనగరాల్లోనే ఎంతో వైభవంగా నిర్వహించే మహంకాళి బోనాల ఉత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. జంటనగరాల నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడి అమ్మవారికి సాక పెట్టి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం 4 గంటలకు స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి మొదటి పూజ చేస్తారు. అనంతరం భక్తులకు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతినిస్తారు. 48 గంటల పాటు అమ్మవారిని నిరంతరాయం దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆలయం ముస్తాబు... ఈ సంవత్సరం మహంకాళి బోనాల జాతరలో సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవాలయాన్ని మొత్తం రంగులతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల నిర్మాణాలు, ప్యాచ్ వర్కులు పూర్తి చేశారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు జనరేటర్లు, 2 మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచుతున్నారు. క్యూలైన్లో ఉండే భక్తుల కోసం రెండు బారీ తెరలు ఏర్పాటు చేసి దేవాలయం లోపల, బయట జాతర దృశ్యాలను ప్రదర్శిస్తారు. బోనంతో వచ్చే భక్తులకు ప్రత్యేక లైను భక్తుల కోసం 5 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళలు 20 నిమిషాల్లో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ ఈ క్యూలైన్ ఆపకుండా భక్తులను లోపలికి పంపిస్తారు. బాటావైపు నుంచి బోనాలతో వచ్చే మహిళల క్యూలైన్, రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒకటి, వీఐపీ పాస్‌లతో వచ్చే వారికి దీని పక్కనే మరొకటి, సాధారణ భక్తులకు క్యూలైన్, అంజలీ థియేటర్, టొబాకో బజార్ నుంచి రెండు సాధారణ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు వచ్చిన సమయంలో దేవాలయ ఆర్చ్ గేటు నుంచి నేరుగా దేవాలయం లోపలికి తీసుకుని వెళ్తారు. ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నాలుగు కూడళ్లలో 550 మంది కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, బాటా చౌరస్తా, సీఎంఆర్, రాణిగంజ్ చౌరస్తాలో ఈ కళాబృందాలు భక్తులను అలరించనున్నాయి. 3వ తేదీ సోమవారం రంగం రోజు అంబారీ ఊరేగింపులోనూ ప్రత్యేకత ఉంటుంది. గుర్రాలు, ఒంటెలు, లంబాడా నృత్యాలు, బాజా బజంత్రీలతో కోలాహలంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఉచిత ప్రసాదాల పంపిణీ మొట్టమొదటి సారిగా ఈ సంవత్సరం జాతరకు వచ్చే భక్తులకు దేవాలయం తరుపున ఉచితంగా ప్రసాదం (పులిహోర) పంపిణీ చేస్తున్నారు. దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత టొబాకో బజార్లో ఈ కౌంటర్ ఏర్పాటు చేశారు. మొబైల్ టాయిలెట్లు మహిళలకు పురుషులకు నాలుగు చోట్ల మొబైల్ టాయిలెట్లను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ వద్ద, అంజలీ థియేటర్ వద్ద రెండు సాధారణ ప్రజలకు, పోలీస్‌స్టేషన్‌కు మరోవైపు, దేవాలయం వెనుకవైపు వీఐపీలకు టాయిలెట్లు సిద్ధం చేశారు. వీటితో పాటు చుట్టు పక్కల ఉండే టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు బోనాల జాతర కోసం ఉత్తర మండలం డీసీపీ ప్రశాశ్‌రెడ్డి నేతృత్వంలో 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 55 మంది సీఐలు, 155 మంది ఎస్సైలు, 700 మంది కానిస్టేబుళ్లును నియమించారు. అలాగే 10 ప్లాటూన్ల బలగాలను, సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాలు ఇవే.. బోనాల జాతరకు వాహనాల్లో వచ్చే వారికి ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సీఎంఆర్, ప్యారడైజ్, పార్క్‌లేన్ గాంధీ విగ్రహం, రాణిగంజ్ అడవయ్య చౌరస్తాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేడు ఘటాల ఊరేగింపు... చార్మినార్: ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం పాతబస్తీలో ఘటాల సామూహిక ఊరేగింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాలిబండలోని కాశీ విశ్వనాథ ఆలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు లాల్‌దర్వాజా మోడ్ మీదుగా ఆయా ఆలయాలకు చేరుకుంటుంది. లాల్‌దర్వాజా మోడ్ వద్ద హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఘటాలకు స్వాగతం పలుకుతారు. ప్రత్యేక పూజలు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద శనివారం సందడి కనిపించింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు, సాక, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ ఏర్పాట్లు పరిశీలించారు. ఐజీ నాగిరెడ్డి, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో కలిసి ఆయన శాంతిభద్రతలు, ట్రాఫిక్ గురించి సమీక్షించారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్, బండ కార్తీకరెడ్డి, ఎమ్మెల్యే సంపత్ తదితరులు శనివారం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గాజులు, పసుపు కుంకుమ పంపిణీ మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ఆధ్వర్యంలో మహిళా భక్తులకు గాజులు, పసుపు, కుంకుమలు పంపిణీ చేశారు. అధ్యక్షులు ఆనంద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహులు, కార్యదర్శి చామకూర ప్రదీప్, సభ్యులు మానిక్‌ప్రభు, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.